బాల్కొండ, సెప్టెంబర్ 19 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీ (ముస్లిం మదీన) కమిటీకి చెందిన 33 కుటుంబాల వారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు తమ ఓటు అంటూ తీర్మానం చేసి పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు.