రామచంద్రాపురం, నవంబర్ 6: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలోని లబ్ధ్దిదారుల బాధలను రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
ఈ మేరకు గురువారం కొల్లూరు డబుల్ బెడ్రూం సముదాయంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. కొల్లూరు ఫేజ్-2లోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.