హైదరాబాద్, జూలై10 (నమస్తేతెలంగాణ): సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థి క శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కపై పలువురు మంత్రులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. బిల్లుల చె ల్లింపు విషయంలో భట్టి విక్రమార పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
కొందరికేమో అడిగినంత బిల్లులను విడుదల చేస్తుండగా మరికొందరు మంత్రులకేమో నామమాత్రంగా విడుదల చేస్తున్నారని ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. ఆర్థిక శాఖలో కమిషన్ల వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టు విశ్వసినీయంగా తెలిసింది. బిల్లుల విడుదలలో మంత్రులకు కూడా స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై వారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.