నిజామాబాద్ : జిల్లాలోని వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన వీర జవాన్ మహేష్ గత ఏడాది నవంబర్ 8న ఉగ్ర మూకలతో పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు. వీర జవాన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కోమన్ పల్లి గ్రామంలో మహేష్ విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు.
జవాన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి యాభై లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును తల్లిదండ్రులకు అందించారు. జవాన్ మహేష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వు కాపీని మంత్రి వేముల అందించారు.
వీర జవాన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా కోమన్‌పల్లికి బైక్ ర్యాలీగా వచ్చారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. జై జవాన్ అంటూ నినాదాలతో మహేష్ త్యాగాన్ని, దేశానికి అందించిన సేవలను ప్రజలు కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం