హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల రెండు దఫాలుగా కురిసిన వర్షాల కారణంగా ఊహించని విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర భుత్వం స్పందించిన తీరు అద్భుతమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. వరద సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు. రాష్ట్రంలో పడిన అతిభారీ వర్షాలు, వరద నష్టంతోపాటు ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలపై శాసనమండలిలో గురువారం సభ్యులు లఘు చర్చ నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలను ఊహించలేమని, అడ్డుకోలేమని.. కానీ ముందస్తు జా గ్రత్త చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాలను మాత్రం నిలువరించగలమని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాలొండ నియోజకవర్గంలోని తన స్వ గ్రామం వేల్పూరు మండలంలో ఒకరోజు రా త్రి 6 గంటల వ్యవధిలోనే 46 సెంటీమీటర్ల వర్షం పడిందని తెలిపారు. జూలై 17 నాటికి సగటు వర్షపాతంలో 20 శాతం లోటు ఉం డగా, 28 జూలై నాటికి 66శాతం అధికవర్షపాతం నమోదైందని సభకు తెలిపారు. ఒకరోజులో 65 సెం.మీ వాన నమోదైందన్నారు.
వరదలపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ
కుంభవృష్టి వల్ల వాటిల్లే నష్టాన్ని సీఎం కేసీఆర్ ముందే అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో వందలమంది ప్రాణాలను కాపాడగలిగామని మంత్రి వెల్లడించారు. సీఎం ఉదయం నుంచీ రాత్రి వరకూ ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం రెండు హెలికాప్టర్లను కూడా ఉపయోగించామని చెప్పారు. మోరంచపల్లితోపాటు వరదల్లోంచి 1500 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించామని వివరించారు.
157 పునరావాస కేంద్రాలు
వరదలకు ప్రభావితమైన 139 గ్రామాల్లో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించామని, వా రికి మంచినీళ్లు, ఆహారం, దుప్పట్లు, మందులు అందించామని మంత్రి వివరించారు. సెక్రటేరియట్, జిల్లా కేంద్రాల్లో 24/7 గంటల పాటు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.
ప్రభుత్వ సిబ్బందికి సెల్యూట్..
క్షేత్రస్థాయిలో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆర్అండ్బీ, పంచాయితీరాజ్.. ఇలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అ ద్భుతంగా పనిచేశారని మంత్రి ప్రశంసించారు. పోలీస్ సిబ్బంది సుమారు 19 వేల మందిని క్షేమంగా పునరావాస కేంద్రాలకు తరలించారని, విద్యుత్తు సిబ్బంది వరదల్లో ఈదుకుం టూ ప్రాణాలకు తెగించి కరెంటును పునరుద్ధరించారని, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెగిన రోడ్లు, కల్వర్టులను ఆర్అండ్బీ అధికారులు ఎప్పటికప్పుడు పునరుద్ధరించారని గుర్తుచేశారు. మెడికల్ అం డ్ హెల్త్ టీం నుంచి ఆశా వరర్ వరకు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
కేంద్రసాయం కోసం ఎదురుచూడకుండా
రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల కొనియాడారు. 2020లో హైదరాబాద్ వరదల సమయంలో తక్షణం రూ.650 కోట్లు విడుదల చేసి నష్టపోయినవారికి రూ.10 వేల చొ ప్పున ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. నిరుడు అకాల వర్షాలతో పంటనష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల చొప్పున 4.50 లక్షల ఎకరాలకు రూ.455 కోట్లు ప్రకటించి ఇప్పటికే రూ. 150 కోట్లు పరిహారం అందించారని, మిగతావి త్వరలోనే అందిస్తాని తెలిపారు. ఇప్పుడు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు.
ఎస్ఎన్డీపీతో అద్భుత ఫలితాలు
జీహెచ్ఎంసీ పరిధిలో వరదల కట్టడికి ము న్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అత్యంత ప్రణాళికబద్ధంగా పనిచేశారని మంత్రి వేముల ప్రశంసించారు. కేటీఆర్ చేపట్టిన వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా గతంలోలా వరదలు రాకుండా అవి అడ్డుకున్నాయని తెలిపారు. రూ.985 కోట్లతో 55 పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు.
నీటి నిర్వహణపైనా దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ కవిత
వరదల కారణంగా సంభవించిన కష్టనష్టాలను చూస్తున్నామని, వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.వరదలు, సహాయక చర్యలపై శాసనమండలిలో జరిగిన లఘు చర్చ సందర్భంగా కవిత పలు అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లోని 23,328 చెరువులు, 42రిజర్వాయర్లకు ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించి నింపారని గుర్తుచేశారు. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో వరదలు ఉప్పొంగాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వరదలు, ముంపు, సహాయక చర్యలు తదితర అంశాలకే కాకుండా, సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే నీటి యాజమాన్య పద్ధతులు, నిర్వహణపైనా దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు.