నిజామాబాద్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా పేరిట రైతులను ఇబ్బంది చేసే మిల్లర్ల(Millars)పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు. పంట నష్టం(Crop Damage),ధాన్యం కొనుగోళ్ల(Grain Centres)పై శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో మంత్రి హైదరాబాద్ నుంచి టెలి కాన్ఫరెన్స్(Tele Conference) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు(Officers) పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పూర్తిగా రైతు కోణంలోనే పనిచేయాలని సూచించారు. ‘ ప్రజాప్రతినిధులుగా రైతులకు భరోసా కల్పిస్తాం. అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో రైతులకు మనో ధైర్యం కల్పించాలని’అన్నారు.