హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు ఘటనపై తప్పించుకోవాలని చూ స్తే ఊరుకోబోమని ఎల్అండ్ టీ ప్రతినిధులను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించా రు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించుకొని బరాజ్ కుంగుబాటుకు గల కారణాలను తేల్చి, నివేదికను అందించాలని ఎల్అండ్టీ ప్రతినిధులను ఆదేశించారు. కుంగుబాటుకు గురైన పిల్లర్ల పునరుద్ధరణ బాధ్యత తమదేనని, తమ సొంత నిధులతో పనులు చేస్తామని గతంలో ప్రకటించిన ఎల్అండ్టీ సంస్థ తాజాగా మాట మార్చిన నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ పనులు చేసిన ఎల్అండ్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, ఏజెన్సీ ప్రతినిధులతో సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
అంతపెద్ద ప్రాజెక్ట్ పనులను నాణ్యత లేకుండా చేశారని, ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి పునరుద్ధరణ పనులను తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృథాచేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని చెప్పా రు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మా ణ ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని సూచించారు. తప్పు చేసినవారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. నేడు మరోసారి సమావేశం మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు సంబంధించి మంగళవారం మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది.