తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి : మంత్రి ఉత్తమ్
భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తాగునీటి భద్రత, ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో భూగర్భజల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ విషయంలో రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, కొత్త బోరుబావుల తవ్వకాలు, అదనపు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనా సమీక్షించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి శ్రీధర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ డైరెక్టర్ జ్యోతికుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

