హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : నిబంధనల మేరకు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందేనని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 150 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చిందని స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.