కరీంనగర్ : తమ ప్రభుత్వం పూర్తిగా పారదర్శక పాలన అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాపాలన (Prajapalana) గ్రామసభల నిర్వహణపై జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించే గ్రామ సభల్లో పారదర్శకంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా దరఖాస్తులు స్పీకరించాలని అధికారులను ఆదేశించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. అధికారులు 24 గంటలు అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోయిందని, దీనిని పరిశీలించేందుకు ఈ నెల 29న తాను పరిశీలనకు వెళ్తున్నానని అన్నారు. ఇప్పుడు వచ్చే దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు(New ration cards) త్వరలో అందిస్తామన్నారు.
మరో మంత్రి దుద్దిళ్ల శ్రధర్ బాబు మాట్లాడుతూ తామిచ్చి అభయ హస్తం హామీలో రెండింటిని ఇప్పటికే అమలు చేశామని, మిగతావి అమలు చేసేందుకే ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో స్వీకరించే ఒక్క దరఖాస్తును కూడా అధికారులు తిరస్కరించరాదని, వాటిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.