Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Tummala Nageswara Rao | తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన చరిత్ర లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tummala Nageswara Rao | తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన చరిత్ర లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ నినోపై అంచనా వేయలేకపోతుంది. ఇలాగే కొనసాగితే కష్టం అన్నారు. ఎల్ నినో ప్రభావం గ్రామాల్లో తీవ్రంగా ఉంది, నీళ్లు, కరెంటుకు ఇబ్బందిగా ఉంది. జనవరి నెల తర్వాత తాగడానికి నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ తర్వాత కూడా ఎల్ నినో కొనసాగితే అధికార పార్టీ ఓడిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్ నినో ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు తిరిగే పరిస్థితి లేదన్నారు. పెన్షన్ పెంచుతామని చెప్పారు, ఏమైందని గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ ఇచ్చినంతే మీరు ఇస్తున్నారు. పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు అని గ్రామాల్లో నిలదీస్తున్నా. వారు చెప్పేది కూడా నిజమేనని మంత్రి పేర్కొన్నారు. 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ల ఓట్లు మనకు అవసరం లేదా? అని కాంగ్రెస్ను ప్రశ్నించారు.
కరువు తర్వాత ఒక్క అధికార పార్టీ కూడా గెలిచినట్టు చరిత్రలో లేదు. ఎన్నో చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కూడా కరువు తర్వాత ఓడిపోయాడని గుర్తు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై అధికార పార్టీ మంత్రే ఇలా మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రస్ అసమర్థ పాలనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

