హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): పత్తి రైతులు పంటలను అమ్ముకోవడంలో ఎలాంటి జా ప్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో పత్తి రైతుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలు ప్రారంభించినట్టు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావు తెలిపారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి సేవలను పొం దాలనుకున్నా.. 8897281111 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఈ వాట్సాప్ ద్వారా రైతులు ఫిర్యాదు చేసినా మారెటింగ్ శాఖ అధికారులు సత్వరమే పరిష్కరిస్తారని తెలిపారు.
పింజ రకము(బీబీ మోడ్) పత్తికి క్వింటాల్‌కు రూ.7521 (పింజ పొడువు మి.మీ 29.5 నుంచి 30.5, మైక్రోనీర్ విలువ 3.5నుంచి 4.3గా), పింజ రకము(బీబీ ఎస్పీఎల్ ) క్వింటాల్‌కు రూ.7471( పింజ పొడువు 29.01 నుంచి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8) గా, పింజ రకము(ఎంఈసీహెచ్) క్వింటాల్‌కు రూ.7421 (పిం జ పొడువు 27.05 నుంచి 28.5, మై క్రోనీర్ విలువ 3.5 నుంచి 4.7)గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పత్తిలో 12శాతం తేమ మించకుండా ఉండి, 8శాతం నుంచి 12 శాతం మధ్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
మలేషియాలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హర్టీకల్చర్ అధికారుల బృందం మూ డోరోజు పర్యటన కొనసాగుతున్నది. శుక్రవారం ఆయన ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి మహ్మద్బిన్తో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యా రు. ఫెల్టా చైర్మన్ అహ్మద్ షబేరీ చీక్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అగ్రి యూనిట్స్ స్థాపనకు అనుకూలమని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా ప్రతినిధులను కోరగా, వారు సానుకూలంగా స్పందించారని తుమ్మల చెప్పారు. అలాగా తెనాషియా కంపెనీని సందర్శించారు.