హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : మద్దతు ధర ప్రకటించే ప్రతి పంటనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టంచేశారు. వానకాలం సీజన్ సన్నద్ధతపై సోమవారం స చివాలయంలో అధికారులతో సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక పంటలకు మద్దతు ధర ప్రకటించి.. ఏ దో ఒకటి, రెండు పంటలు కొనుగోలు చేసి మిగతా పంటల కొనుగోళ్ల బాధ్యత ను రాష్ర్టాలపై వదిలేయడం కరెక్ట్ కాదన్నారు. దీంతో తెలంగాణ వంటి రాష్ర్టాలపై ఆర్థికభారం పడుతుందని చె ప్పారు.
వానకాలం సీజన్‌కు సంబంధిం చి యూరియా, విత్తనాల సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌కు ఇప్పటికే 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు, ఈ నెలాఖరుకు మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించి అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.