హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఈ వానకాలం సీజన్‌కు అవసరమైన ఎ రువులను అం దుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సాగు, ఎరువులు, విత్తనాల లభ్యతపై శనివారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను కేం ద్రం నుంచి ముందస్తుగా తెప్పించాలని సూచించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 7.97 టన్నుల యూరియా, 75,278 టన్నుల డీఏపీ, 4.27 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచామ ని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మంత్రికి వివరించారు. ఇప్పటికే రూ.61.15 కో ట్లు విలువైన 1,09,937 క్వింటాళ్ల విత్తనా లు రైతులకు అందజేశామని, రైతులు 62 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్‌పామ్ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు