హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు ముందు అదనపు సొమ్ము చెల్లించాలని, ఆ తర్వాతే రైతుల అర్హతను బట్టి రుణమాఫీ చేస్తామని ఆదివారం పత్రికా ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ. 2 లక్షలలోపు రుణమాఫీకాని రైతుల కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్లకు కూడా చెల్లిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు రుణమాఫీపై అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో విడతల వారిగా రెండుసార్లు రూ. 28వేల కోట్లు రుణమాఫీ చేస్తే తాము ఒకేసారి రూ. 17,933 కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు.