కొల్లాపూర్, సెప్టెంబర్ 7: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్న్‌న్రు ఈ నెల 16న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల ‘జల’కల సాకారం కాబోతున్నదని తెలిపారు. వెట్న్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్‌తో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. నార్లాపూర్ కంట్రోల్ రూం వద్ద హెలిప్యాడ్, కొల్లాపూర్ ఈదమ్మ ఆలయం వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం మీడియాతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పాలమూరు లిఫ్ట్ నీటి రాకతో ఈ ప్రాంతం మరో కోనసీమను తలపించడం ఖాయమని అన్నారు. బీడు భూముల్లో కృష్ణమ్మ జలసవ్వడి చేస్తుంటే.. పొలాలన్నీ పచ్చని మాగాణుల్లా దర్శనమిస్తుంటే.. ఈ సుందర దృశ్యం చూడడానికి రెండు కండ్లు చాలవని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సయయంలో కేసీఆర్ నడిగడ్డ ప్రాంతంలో పాదయాత్ర సందర్భంగా పాలమూరు గోస చూసి కన్నీరు పెట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పెద్ద మోటర్లతో పాలమూరు ప్రాజెక్టు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. అనంతరం కంట్రో ల్ రూం వద్ద పనులు చేస్తున్న ఒడిశా, జార్ఖండ్ కూలీలను మంత్రి, ఎమ్మెల్యేలు ఆప్యాయంగా పలుకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. సమావేశంలో ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు అమర్‌సింగ్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.