మహబూబ్‌నగర్ : నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోదాను పక్కనపెట్టి చిన్న పిల్లాడిలా మారిపోయారు. పిల్లలతో ఆడిపాడి ఆనందంగా గడిపారు. వివరాల్లోకి వెళ్తే..మూసాపేట మండల పరిధిలోని గౌరీదేవిపల్లి గ్రామంలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం నిండి అలుగుపోస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని అప్పుడే అక్కడ ఈత కొడుతున్న చిన్నారులు నీళ్లలోకి దూకమని పిలిచారు. చిన్నారుల కోరిక మేరకో లేక బాల్యం గుర్తుకువచ్చిందో తెలియదు కానీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరి వెంట ఒకరు చెక్ డ్యాంలోకి దూకారు. కొద్ది సేపు సరదాగా ఈత తమ ఆనందాన్ని పంచుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవి పల్లి, కందూరు గ్రామంలో 4 కోట్ల 38 లక్షల రూపాయల తో నిర్మించిన చెక్ డ్యామ్ ను ప్రారంభించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి గారితో కలసి చెక్ డ్యామ్ లో సరదాగా ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ @VSrinivasGoud @trspartyonline pic.twitter.com/TsfiQRjNe1
— Namasthe Telangana (@ntdailyonline) July 26, 2021
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవి పల్లి, కందూరు గ్రామంలో 4 కోట్ల 38 లక్షల రూపాయల తో నిర్మించిన చెక్ డ్యామ్ ను స్థానిక ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డితో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.@VSrinivasGoud @trspartyonline pic.twitter.com/REAqI257SC
— Namasthe Telangana (@ntdailyonline) July 26, 2021
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్‌కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం