
మహబూబ్నగర్ : కరోనా పేషెంట్ల కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు కానున్నాయి.
గతేడాది కరోనా ప్రారంభం నుండి కరోనా పేషెంట్లకు, వలస కార్మికులకు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత, అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ పీహెచ్సీ లలో కోవిడ్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెల్సీ కవిత చొరవతో కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ కింద Syngenta India Private Limited ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ పీహెచ్సీ , సీహెచ్ సి కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
సీహెచ్ సీ కల్వకుర్తి, సీహెచ్ సీ జడ్చర్ల, పీహెచ్ సీ బాలానగర్, ఎంసీహెచ్ అచ్చంపేట, పీహెచ్సీ కోయిల్కొండ, పీహెచ్సీ మద్దూర్, పీహెచ్సీ కొల్లాపూర్, పీహెచ్సీ వీపనగండ్ల లలో బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వంద కరోనా బెడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
Thank you @VSrinivasGoud Garu for extending your support. I am eternally grateful to @SyngentaIND for coming together to stand with the people of Mahabubnagar. https://t.co/fjrdqeRD3H
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 18, 2021