Srinivas Goud | హన్వాడ : కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ( BRS Party )కి బలం అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్( Minister Srinivas Goud ) స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా( Mahabubnagar dist ) హన్వాడ మండలం కొత్తపేట గ్రామ శివారులో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇస్తామని ప్రధాని మోదీ( PM Modi ) ప్రకటించి.. ఆ హామీని విస్మరించారన్నారు. బీజేపీ నాయకులు( BJP Leaders ) దేవుళ్ల పేరిట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్( BJP Govt ) ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. మోదీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత కూలీలు, భూముల రేట్లు పెరిగాయన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.