మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు.
బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా బ్రిడ్జికి సమాంతరంగా నిర్మిస్తున్న సర్వీసు రోడ్డు, సీసీ డ్రైన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.