శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 04, 2020 , 02:41:28

కళాకారులకు సంక్షేమ పథకాలు

కళాకారులకు సంక్షేమ పథకాలు
  • నాగర్‌కర్నూల్‌ కళాకారుడికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సత్కారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కళాకారుల సంక్షేమం కోసం గుర్తింపుకార్డులు, పెన్షన్లు, ఉద్యోగాలను కల్పించారని రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కళాకారులు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కలిసిన నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రానికి చెందిన మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శన మొగులయ్యను మంత్రి సత్కరించారు. మొగులయ్య జీవనభృతి కోసం ప్రతినెలా రూ.10 వేలు ప్రత్యేక పెన్షన్‌ ఇవ్వాలని సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణను శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. 


నేడు టూరిజం రిసార్టులనుప్రారంభించనున్న మంత్రి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మన్ననూర్‌ (ఫరాబాద్‌), ఈగలపెంటలో రూ.34 కోట్లతో నిర్మించిన హరిత టూరిజం రిసార్టులను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం ప్రారంభిస్తారు. పర్యాటకుల కోసం మన్ననూర్‌లో 20 కాటేజీలు, ఈగలపెంటలో 20 కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని వసతులతోపాటు ఆహ్లాదాన్ని పంచేలా పార్కులను తీర్చిదిద్దారు.


logo