హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ పికిల్‌బాల్ ఆన్ టూర్ చొరవతో హైదరాబాద్ ఓపెన్ మంగళవారం ఘనంగా ముగిసింది. హోరాహోరీగా సాగిన టోర్నీలో కుల్దీప్ మహాజన్, అనూజ కామేశ్వరి, వంశిక్ కపాడియా, వృశాలి ఠాక్రే సత్తాచాటారు. మూడు రోజుల పాటు జరిగిన టోర్నీలో మొత్తం 250 మంది పైగా ప్లేయర్లు పోటీపడ్డారు.
చివరి రోజు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కుల్దీప్ మహాజన్..సమీర్‌వర్మను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో వృశాలి ఠాక్రెను ఓడించి అనూజ మహేశ్వరి విజేతగా నిలిచింది.