భూదాన్ పోచపల్లి, ఆగస్టు 27 : భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మణ్ నగర్ కాలనీలో విజేత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వినాయక చవితి మండపానికి కవర్ కడుతూ బుధవారం ఉదయం ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. పట్టణ కేంద్రానికి చెందిన పోతగల సతీశ్ ( 38) మండపం పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తడిగా ఉన్న మండపంపై నుంచి సతీశ్ ఒక్కసారిగా జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బోనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సతీశ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరాయి ఇంట్లో నివసిస్తున్నాడు.