Ghup Chup Ganesha | టాలీవుడ్ యువ నటులు రోహన్, రిదా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘప్ చుప్ గణేశ. ఈ సినిమాకు సూరి.ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై కేఎస్ హేమరాజ్ నిర్మిస్తున్నాడు. అశోక్ వర్ధన్, సోనాలి పానిగ్రాహి, కిశోర్ మారెశెట్టి, అంబాటి శ్రీనివాస్, జబర్దస్త్ గద్దం నవీన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్పొరేట్ లవ్ – కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఉద్యోగం వెతుక్కుంటూ పల్లెటూరి నుంచి నగరానికి వచ్చిన ఓ యువకుడి కథ ఇది. కష్టపడి ఉద్యోగం సంపాదించిన తర్వాత, అదే ఆఫీసులో హెచ్ఆర్గా పనిచేస్తున్న అమ్మాయిని అతను ప్రేమిస్తాడు. వారి ప్రేమకథలో ఎదురైన సంఘటనలు, ఊహించని మలుపులతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.