హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్ని యువత గమనించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నాయకుల పట్ల యువత అప్రమత్తంగా ఉండి, వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్ మండలానికి చెందిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ టంకరి శివప్రసాద్‌తో పాటు కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎంకు చెందిన యువకులు, కార్యకర్తలు, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, రైతు కూలీలు సుమారు 300 మంది మంత్రి సమక్షంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో అధికార పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.