Minister Srinivas Goud | మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద రూ. 3.50 కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సమీపంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మహబూబ్ నగర్, కొత్తగంజ్ పోచమ్మ టెంపుల్ సమీపంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో కలెక్టర్ రవి నాయక్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, టీజీవో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్, జిల్లా కార్యదర్శి బక్క శ్రీనివాసులు, టీజీవో యూనియన్ నాయకులు సహదేవ్, హరికృష్ణ, రంజిత్, పరమేశ్వర్ రెడ్డి, యాదగిరి, టైటస్ పాల్, మధుసూదన్ గౌడ్, సంధ్య, విజయ్, వెంకటయ్య, చెన్నకిస్టన్న, టీఎన్జీవో అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రా నాయక్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు గౌడ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాం రెడ్డి, జడ్పీ సీఈఓ జ్యోతి, డీఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.