కరీంనగర్ : రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu )అన్నారు. కరీంనగర్ జిల్లా కాటారం మండలం గంగారంలో ఆయన మీడియతో మాట్లాడారు. ప్రతిపక్షాలు రుణమాఫీ పై(Loan waiver) చేస్తున్న అసత్య ఆరోపణలు నమ్మవద్దన్నారు. సాంకేతిక సమస్యలు, బ్యాంకుల ద్వారా ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల ఇంకా రుణమాఫీ అందని వారికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలోనే అందజేస్తామని హామీనిచ్చారు.
అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగితే తాము వెంటనే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేప్, పార్టీ నేతలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టమన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ పంట నష్టం పై సర్వే చేసి నివేదిక ఇచ్చిన అనంతరం తగిన పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి రోజురోజుకు ప్రజల ఆదరణ తగ్గుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమన్నారు. బడుగు, బలహీన వర్గాల నేత మహేష్ గౌడ్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం అభినందనీయమన్నారు.