హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ పనులు, మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పూర్తి చేసి తీరుతామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. ‘సుచిత్ర-కొంపల్లి, అల్వాల్-శామీర్‌పేట ప్రాంతాల మెట్రో వివరాలు ఏవి?’ అంటూ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేస్తున్నామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి అంశంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ తాతా మధు లేవనెత్తిన పొన్నం సమాధానమిచ్చారు. ట్యాంకర్ నీరు కొనాలంటే రూ.10 వేలు చెల్లించాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పగా పొన్నం అలాంటిదేమీ లేదన్నారు.