హైదరాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్( Auto driver) దాడిలో తీవ్రంగా గాయపడి గాంధి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళను మంత్రి సీతక్క(Minister Seethakka) పరమార్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. హాస్పిటల్ నుంచే జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
దాడి ఘటన వెలుగులోకి రాగానే నిందితుడిని అరెస్టు చేసాం. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. జైనూరు(Jainur) ఆదివాసీ యువత సంయమనంతో ఉండాలని కోరారు. ఆందోళన అవసరం లేదు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని భరోసానిచ్చారు. కాగా, ఆటో డ్రైవర్ దాడిలో మహిళ గాయపడటంపై జైనూర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జైనురు మండల కేంద్రంలో పలు దుకాణాల సముదాయాలకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను సైతం తగలబెట్టారు.