Minister Seethakka | హైదరాబాద్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు. రైతులపై నోరు పారేసుకున్న మంత్రి సీతక్కపై అన్నదాతలు మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సకాలంలో పంట కొనుగోళ్లు చేయాలని, బోనస్ ఇవ్వాలని రైతన్నలు డిమాండ్ చేశారు. ఇక ఆగ్రహావేశాలతో ఊగిపోయిన మంత్రి సీతక్క మీరు అసలు రైతులేనా అంటూ అవమానిస్తూ మాట్లాడి వెళ్లిపోయారు.
కాసేపటికే ఓ వేదికపై మంత్రి సీతక్క ప్రసంగిస్తూ మళ్లీ నోరు పారేసుకున్నారు. మేం పరామర్శకు పోతుంటే కొంత మంది రైతులు మమ్మల్ని అడ్డుకున్నారు. తాగిన రైతులు మా బండికి అడ్డం వచ్చారు. బండి కింద పడితే ఎవరిది బాధ్యత. రైతులు బుద్ధి లేకుండా ప్రవర్తించారు. రైతులకు మేం ఏం అన్యాయం చేశామని సీతక్క అన్నారు.
బ్రేకింగ్ న్యూస్
రైతులను తాగుబోతులు అన్న సీతక్క
మేము పరామర్శకు పోతుంటే తాగిన రైతులు మా బండి కింద పడితే ఎవరిది బాధ్యత
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకుని, బోనస్ ఇవ్వాలని, సకాలంలో పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన రైతులు
అసలు… https://t.co/wjB5BP5ID8 pic.twitter.com/1lfEHdAlWk
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2025