హైదరాబాద్ జూన్ 9 (నమస్తేతెలంగాణ): అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) చేర్పించాలని మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఆమె వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అక్టోబర్ 2 నాటికి మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. 22 జిల్లాల్లో చే పట్టిన ఇందిరా మహి ళా శక్తి భవనాలను పూర్తిచేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లల నమోదును పెంచాలన్నారు.