హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. దేశంలోని నిరుద్యోగ, ఆర్థిక సమస్యలను కప్పిపుచ్చేందుకు సోనియా గాంధీ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పార్లమెంట్లో రాష్ట్రపతితో అవాస్తవాలు చెప్పించిందని ఆక్షేపించారు. గతంలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఆహ్వానించకుండా అవమానించిందని గుర్తుచేశారు.