బండి మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలి.. మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంజాబ్లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యవహరించిన తీరు, తెలంగాణ ప్రజలను అవమానించిన తీరు గుండెల నిండా బాధ నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ధాన్యం మీరే కొనండి.. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి.. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం.. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి దిక్కు లేకుండా పోయాడని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం చేసే పార్టీలు కనుమరుగవడం ఖాయమన్నారు.
బండి సంజయ్ అసలు మనిషేనా..?
యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తానని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ను పట్టించుకోవద్దని బండి అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రం సహకరించట్లేదని బండి అంటున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదన్నారు. బండి సంజయ్ అసలు మనిషేనా..? బీజేపీ అధ్యక్షుడేనా? అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

