Ponnam Prabhaker | హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగకు వీరభద్రస్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. జాతర నిర్వహణకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. అధికారులు, పోలీసులు, పాలక వర్గానికి జాతర నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అయితే జాతర నిర్వహణలో పోలీసులు, అధికారులు, పాలక కమిటీ మధ్య ఏకాభిప్రాయం లోపించింది. జాతర విధుల నిర్వహణ కోసం వచ్చిన కొందరు పోలీసు అధికారుల ప్రవర్తనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో దేవాదాయ శాఖ అధికారులపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. వీటన్నింటిని గ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. పోలీసులు, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం గర్భగుడిలోకి వెళ్లకుండా బయట నుంచే మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోయారు.
ఇక స్థానికంగా ఉన్న ఆలయ వసతి గృహం వద్దకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మోకాళ్లపై నిలబడి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేలపై కూర్చొని తన అసహనాన్ని ప్రదర్శించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు ఎంత బ్రతిమలాడినా ఆయన అక్కడి నుంచి లేవకుండా అక్కడే కూర్చుని ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Makara Jyothi | సంక్రాంతి పర్వదినాన శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
Medchal | మాయమాటలు చెప్పి మూడు పెళ్లిళ్లు.. చివరకు ఏం జరిగిందంటే..?
Dalit Athlete | దళిత అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు