Dalit Athlete | దళిత అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు
Dalit Athlete | కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారనే విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Dalit Athlete | పథనంతిట్ట : కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారనే విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇప్పటి వరకు 44 మంది నిందితులను అరెస్టు చేసి విచారిస్తోంది. బాధిత అథ్లెట్ ఫిర్యాదు మేరకు 30 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు డీఐజీ ఎస్ అజీతా బేగం పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితులేవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
బాధితురాలు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి ఆమెపై అనేక మంది లైంగిక దాడికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆమె కోచ్‌లు, సహ క్రీడాకారులు, క్లాస్మేట్స్ ఉన్నారన్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె తన తండ్రి ఫోన్‌ను ఉపయోగించేవారు. ఆ ఫోన్‌ను, ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు 40 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతూ, బాధితురాలికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ విధంగా అన్యాయానికి గురవుతున్నదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Health tips | స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే ఆ ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదం ఉందట..!
Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో పేలిన మందుపాతర.. ఆరుగురు జవాన్లకు గాయాలు
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

