Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్లో మందు పాతర పేలింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఖంబ ఫోర్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా.. మందుపాతర పేలింది. ఈ ఘటనలో గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్దారు. అప్రమత్తమైన మిగతా బలగాలు.. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. జవాన్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
జనవరి 4వ తేదీన జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తూ బందీపోర్ వద్ద లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సైనికులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Laurene Powell Jobs | మహా కుంభమేళా.. అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ సతీమణి
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్