Laurene Powell Jobs | ప్రయాగ్‌రాజ్ : యాపిల్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే లారీన్ పావెల్ జాబ్స్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు. ప్రస్తుతం లారీన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని వెల్లడించారు.
మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు వచ్చిన లారీన్.. పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లారీన్ తన పేరును కమలగా మార్చుకున్నట్లు కైలాసానంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. లారీన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని తెలిపారు. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని గిరి మహారాజ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbh | రెండో రోజూ కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్.. ఇసుకపోస్తే రాలనంతగా భక్తులు
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్