Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : ఓ వ్యక్తి నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. మాయమాటలు చెప్పి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని గబ్బిబాల్పేట్లో లక్ష్మణరావు(34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇక బతుకుదెరువు కోసం ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయి అనూషను వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇక బాలాజీనగర్‌కు చెందిన లీలావతి (25)తో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికి మెదక్ చర్చిలో 2021లో వివాహం చేసుకున్నాడు. ఓ కుమారుడిని కూడా కన్నారు. ఆ తర్వాత ఆమెతో కూడా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఇక 2022లో శబరి అనే మరో యువతితో పరిచయం పెంచుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
లక్ష్మణరావు మల్కాజిగిరిలో ఉంటున్నాడని రెండో భార్య లీలావతి కుటుంబ సభ్యులు తెలుసుకుని అక్కడికి చేరుకోగా.. అక్కడ మరో మహిళ శబరిని వివాహం చేసుకున్నట్లు తెలుసుకుని షాకయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మొత్తం ముగ్గురిని వివాహం చేసుకున్న లక్ష్మణరావుపై లీలావతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లక్ష్మణరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Amberpet | అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నుంచి దూకిన దొంగ..
Hyderabad | నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో.. జంట హత్యల కలకలం
Dalit Athlete | దళిత అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు