Amberpet | హైదరాబాద్ : చోరీ చేసి పారిపోతూ ఓ దొంగ ఫ్లై ఓవర్ నుంచి కిందకు దూకాడు. ఈ ఘటన అంబర్పేటలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
అంబర్పేట ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నిర్మాణానికి సిద్ధంగా ఉంది. అయితే ఫ్లై ఓవర్పై ఉన్న సామాగ్రిని ఓ దొంగ అపహరించి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆందోళనకు గురైన దొంగ ఫ్లై ఓవర్పై నుంచి కిందకు దూకేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన దొంగను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.