Ponnam Prabhakar | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : మెహదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఏడు అడుగుల అమీన్అహ్మద్ అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగం ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ‘సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అన్సారీకి ఆర్టీసీలో మరో ఉద్యోగం ఇవ్వగలరు’ అంటూ సజ్జనార్‌కు సూచించారు. ఇటీవల కారుణ్య నియామకం కింద అన్సారీకి కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అయితే అతని ఎత్తు 7ఫీట్లు కాగా, 6.4 ఫీట్ల ఎత్తున్న బస్సులో డ్యూటీ ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు అన్సారీ బాధలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరలైంది. ప్రభుత్వం స్పందించింది.