కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు. ఆదివారం ఎల్ ఎండీ జలాశయం నుంచి కాకతీయ కాలువ(Kakatiya canal) ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట వరకు సాగు నీటినిస్తామని, రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలన్నారు. ఆరు గ్యారెంటీ లను పక్కగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్, తదితరులు ఉన్నారు.