హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 4న నగరంలో పర్యటించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఎల్బీస్టేడియంలో జరిగే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు.