హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ముందుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మాటాడారు. ఆర్టీసీ కార్మికులు ప్రతి రెండవ మంగళవారం డిపో స్థాయి నుంచి మంత్రివరకు వారి సమస్యలపై నేరుగా కలువవచ్చని చెప్పారు. ఆర్టీసీలో వీలైనంత తర్వగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. గుర్తింపు సంఘం ప్రతినిధులు, అధికారులతో విలీనానికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పడుతుందని స్పష్టం చేశారు. తర్వాతే ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనానికి సంబంధించి.. ఏపీలో నిర్వహించిన అధ్యయన నివేదికలను మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేంద్‌రెడ్డికి జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అందజేశారు. ఏపీ లో విలీనం తర్వాత ఉద్యోగులు సమాజంలో విలువలతో జీవిస్తున్నారని చెప్పారు.
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను పక్కనపెట్టి.. తక్షణమే విలీన ప్రక్రియ ప్రారంభించాలని ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, నాన్ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలీనం కంటే ముందు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. మే డే నాడు సీఎం ముందు విలీనం కావా ల్నా? లేదా ఎన్నికలు కావా ల్నా? అని అడిగి తే అన్ని కార్మికసంఘాలు ముందు విలీనమే కావాలని, తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలిపామన్నారు. జూన్ 2న కార్మికులకు తీపి కబురు చెప్పాలని జేఏసీ నాయకులు కోరారు.
ఆర్టీసీలో ఎన్నికలు జరుపుతామని పొన్నం చెప్పడాన్ని తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూ నియన్ ఖండించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని యూనియన్ ప్రెసిడెంట్ పి కమల్‌రెడ్డి, వర్కిం గ్ ప్రెసిడెంట్ ఎం నరేందర్ డిమాండ్ చేశారు. జూన్ 2న అపాయింటెడ్ డేట్‌గా ప్రకటించాలని టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు డిమాండ్ చేశారు. పొన్నం వ్యాఖ్యలను ఆర్టీసీ సూపర్వైజర్స్ కమిటీ ఖండించింది. సీఎం హామీ మేరకు వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని సూపర్వైజర్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ వాసు, ప్రెసిడెంట్ అశోక్, వరింగ్ ప్రెసిడెంట్ రాజు, సెక్రటరీ రామారావు డిమాండ్ చేశారు. ముందు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి చెప్పడం విచారకరమని ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) నేతలు మల్లేశం గౌడ్, సయ్యద్ మహ్మద్, జి అబ్రహం అన్నారు.
2021 పే సేల్‌లో మార్పులు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రాన్ని అందించినట్టు నాయకులు తెలిపారు. ఆర్పీఎస్-2017లో కొన్ని స్లాబ్స్‌లో జూనియర్స్, సీనియర్స్‌ను ఒకే సేలులో ఫిక్స్ చేశారని, వివిధ క్యాటగిరీల్లో 19 చోట్ల అలా జరిగిందని, దీనివల్ల సీనియర్స్‌కు లాభం లేకుండాపోయిందని, దానిని సరిచేయాలని కోరారు. ఇంక్రిమెంట్లు, ఇంటి అద్దెలు, సీసీఏ, టైపిస్టులకు స్పెషల్ పే, ఇతర అలవెన్స్‌ల విషయంలో నిర్ణయం తీసుకొని, కొత్త సర్క్యులర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ తెలంగాణచౌక్, మే 27: ఆర్టీసీని విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లోబుధవారం ఆయన మాట్లాడుతూ. 28 డిమాండ్లను అమ లు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మేడే రోజు యూనియన్ సమావేశంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటుంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ముందు యూనియన్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అనంతర యూనియన్ నాయకులు థామస్‌రెడ్డి, ఒరుగంటి రమణారావులను శాలువలతో ఘనంగా సన్మానించారు. జిల్లా రీజియన్ గౌరవాధ్యక్షుడు రమణారావు, టీఎంయూ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.