Indiramma Illu | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఇండ్ల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడ్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంసతృప్తి వ్యక్తంచేశారు. వారు చేసేది అరకొర సాయమేనని వ్యాఖ్యానించారు. శనివారం సచివాలయంలోని మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ ఒకో ఇంటికి కేంద్రం ఇచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.52 లక్షలు మాత్రమేనని చెప్పారు.
తాము ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నట్టు చెప్పారు. భూభారతి దరఖాస్తులలో సాదాబైనామాలకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు తీర్పు రాగానే పరిషరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.