హైదరాబాద్, ఆగస్ట్ 20 (నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)ను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌కు బాధ్యత అప్పగించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిబంధనల ప్రకార మే భూముల క్రమబద్ధీకరణ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వని వారి నుంచి ఇప్పుడు తీసుకొని యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాలో మొదటి దశలో వంద ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టం 2024పై 23, 24 తేదీల్లో జిల్లాల్లో వివిధ రంగాల మేధావులతో వర్ షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తులను పదిరోజుల్లో పరిషరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వానికి నోటీసులు
ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రేవంత్‌రెడ్డి సర్కారును ఆదేశించిం ది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.