హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజికవర్గాల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలో గురువా రం ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. లగచర్ల రైతుకు బేడీలు వేయడం తప్పిదమేన ని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారని తెలిపారు. హాస్టళ్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ నెల 31వ తేదీలోగా విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యార్థులకు డైట్, కా స్మెటిక్ చార్జీలు పెంచిన నేపథ్యం లో 14న మం త్రులు, అధికారులు హాస్టళ్లలో భోజనం చేస్తామని తెలిపారు. భద్రాచలం గుడి అభివృద్ధిలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీలు సర్వేయర్లతో సమన్వ యం చేసుకోవాలని తెలిపారు. ఇతర విభాగాల్లోకి సర్దుబాటు అయిన వీఆర్వోలు, వీ ఆర్ఏలకు పరీక్ష నిర్వహించి రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకుంటామని వెల్లడించారు.