వరంగల్ : అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒడిదొడుకులు ఎదురైనా పేదలను ఆదుకుంటామని తెలిపారు. కోట్లాది రూపాయల ఖర్చుతో నాలుగు పథకాలు ప్రారంభించాం. పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. భూమి లేని పేదల పరిస్థితి చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇల్లు లేని పేదలకు మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు అందరికి అందుతాయి. కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..