వనపర్తి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): త్వరలో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా మెంటపల్లిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడొద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తున్నామని, దాని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.