హైదరాబాద్ సిటీబ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ, దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దగా చేశాయని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని చెప్పారు. మంగళ వారం తూంకుంటలో నిర్వహించిన మేడ్చల్ బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని అన్నారు.