Minister Mahender Reddy | నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారు : మంత్రి మహేందర్ రెడ్డి
Minister Mahender Reddy | గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారని సమాచార, పౌర సంబంధా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నరు. శుక్రవారం శివారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.
వికారాబాద్ : గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారని సమాచార, పౌర సంబంధా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Minister Mahender Reddy) అన్నారు. శుక్రవారం శివారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో 27,147 పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం అమలు చేస్తామన్నారు.
దీని ద్వారా 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు పాఠశాలల్లో 602 మంది విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైందని, దసరా నుంచి 1052 పాఠశాలల్లో 92,000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం అమలు చేస్తామన్నారు. మన ఊరు -మనబడి కార్యక్రమంలో జిల్లాలోని 371 పాఠశాలలను రూ.109 కోట్లతో ఆధునికరిస్తున్నాం.
మధ్యాహ్న భోజన పథకం గతంలో 9 తరగతి వరకు ఉండేది. ఇప్పటి నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్,
మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

